గతవారం బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగి భారతీయులను ఊహించని స్థాయిలో ఆందోళనకు గురిచేశాయి. 10 గ్రాముల ఫ్యూర్ గోల్డ్ రేటు దాదాపు రూ.6వేల వరకూ పెరగటంతో దూసుకు ఇంకా కొనసాగుతుందా అనే భయం సామాన్య కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, పండుగలకు ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వాళ్లు ముందుగా తమ సమీప నగరాల్లోని రిటైల్ ధరలను పరిశీలించటం బెటర్.
ఆగస్టు 10న బంగారం రేట్లు తగ్గాయి. ఆగస్టు 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.38 తగ్గుముఖం పట్టింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 197గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 930గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 10, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
