ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌

ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కోటి 36 లక్షల విలువైన గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చైన్స్, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు.