వాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన బంగారం, వెండి ! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..

వాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్:  భారీగా పడిపోయిన బంగారం, వెండి !  తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఈరోజు  (2 సెప్టెంబర్ 2026న) భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. గత నాలుగు రోజులుగా ధరలు పడిపోతూ వస్తుండటంతో ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుత ధరల వివరాలు చూస్తే... ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధర 1 శాతానికి పైగా తగ్గి రూ.1 లక్ష 50 వేల  దగ్గర తడబడుతోంది. అలాగే వెండి ధర 1.44 శాతం పడిపోయి కిలో రూ. 2 లక్షల 32 వేల వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు 4,300 డాలర్లకు, స్పాట్ వెండి 63 డాలర్లకు పడిపోయాయి.

ధరలు తగ్గడానికి  కారణాలు  
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (అమెరికా సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్ కెవిన్ వార్ష్ ఇటీవల వడ్డీ రేట్ల పెంపుపై కఠినమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ నెలలోనే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 70 శాతానికి చేరిందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి.

వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో పాటు, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన బైబ్యాక్ కార్యక్రమం కారణంగా ప్రభుత్వ బాండ్ల రాబడులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బుధవారం ఉదయం నాటికి 10 సంవత్సరాల యూఎస్ బాండ్ ఈల్డ్ ఏకంగా 4.8 శాతానికి (అక్టోబర్ 2023 తర్వాత ఇదే గరిష్ట స్థాయి) చేరగా, 30 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 5.28 శాతానికి పెరిగింది. సాధారణంగా బాండ్ల రాబడులు పెరిగితే, బంగారంలో పెట్టుబడులు తగ్గిపోతుంటాయి.

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ పైకి కదిలాయి. ప్రస్తుతం డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ బ్యారెల్ 91 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 96 డాలర్లకు చేరుకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మరింత ఎక్కువవుతుందనే భయాలు పెరిగాయి.

ఈ రోజు  (2 సెప్టెంబర్ 2026న) బంగారం ధరలు : 

1 గ్రాము   24క్యారెట్ల బంగారం ధర రూ.207 తగ్గి  రూ.15,202,  22 క్యారెట్ల  ధర రూ.190  తగ్గి రూ.13,935,  18 క్యారెట్ల ధర రూ.155  తగ్గి రూ.11,402. 

10గ్రాముల   24క్యారెట్ల బంగారం ధర రూ.2,070 తగ్గి   రూ.1,52,020, 22 క్యారెట్ల  ధర రూ.1,900  తగ్గి రూ.1,39,350, 18 క్యారెట్ల ధర రూ.1,550 తగ్గి   రూ.1,14,020.

ఇక తెలుగు  రాష్ట్రాల్లో ప్రస్తుతం ధరలు చూస్తే:

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్,  ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350, 18 క్యారెట్ల ధర  రూ.1,14,020. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350, 18 క్యారెట్ల ధర  రూ.1,14,020. 

ఇక ఈరోజు (2 సెప్టెంబర్) బుధవారం వెండి ధరలు చూస్తే 1 గ్రాము రూ.5 తగ్గి  ధర 245, కిలో ధర  రూ. 5,000 తగ్గి  రూ.2,45,000 చేరింది.