ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్.. స్కిల్ ఉన్నోళ్లకు ఆన్‌‌లైన్‌‌లో ఆఫర్లు

ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్.. స్కిల్ ఉన్నోళ్లకు ఆన్‌‌లైన్‌‌లో ఆఫర్లు
  • ఐటీ, టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ
  • వర్క్ ప్రెజర్ లేదంటున్న యూత్.. ఎక్కువ మంది అటువైపే మొగ్గు
  • జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్‌‌కే ఎక్కువ ప్రయారిటీ 

హైదరాబాద్, వెలుగు:  టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వర్క్ కల్చర్ మారుతున్నది. స్కిల్​ ఉన్నోళ్ల కాడికే అవకాశాలు అందివస్తున్నాయి. దీంతో ఒకే ఆఫీసు, ఒకటే జాబ్, నెలవారీ జీతం అని కాకుండా.. నచ్చిన పనిని, నచ్చిన టైమ్‌‌లో, నచ్చిన చోట చేసుకునే కొత్త కల్చర్ వస్తున్నది. అదే ‘ఫ్రీలాన్సింగ్’. కొన్ని సందర్భాల్లో.. ఏడాదిపాటు జాబ్ చేస్తే వచ్చే శాలరీని రెండు, మూడు నెలల్లోనే ఫ్రీలాన్సర్లు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఐటీలోనే, అదీ ప్రధాన నగరాల్లోనే ఫ్రీలాన్సింగ్ కనిపించేది.. ఇప్పుడు అన్ని రంగాలకు ఇది విస్తరిస్తున్నది. అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నది. అయితే టెక్నాలజీకి తగినట్లుగా అప్‌‌డేట్‌‌ అవుతుండాలని, నైపుణ్యం ఉంటేనే ఇందులో రాణిస్తామని ఫ్రీలాన్సర్లు చెప్తున్నారు.


ఫ్రీలాన్సర్లు.. నైపుణ్యమున్న స్వతంత్రులు. అంటే ఓ సంస్థ కింద.. ఇంత జీతానికి, ఇంత సమయం అని పని చేయరు. ఏ సంస్థ కోసమైనా పని చేస్తారు. చేసిన పనికి తగ్గ వేతనం పొందుతారు. అక్కడ పని పూర్తయ్యాక మరో సంస్థ. లేదా ఒకేసారి రెండు అంతకుమించి ప్రాజెక్టులూ టేకప్ చేస్తుంటారు. ఆఫీసుకే వెళ్లి పని చేయాలనే నిబంధనలేమీ ఉండవు. గడువు లోనే కంప్లీట్ చేయాలనే టార్గెట్స్, ఒత్తిడి కూడా కొన్ని సార్లు ఉండవు. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ ఫ్రీలాన్సింగ్ వైపే మొగ్గుచూపుతున్నారు. స్కిల్స్, ప్రజెంటేషన్ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న వాళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. కొందరైతే.. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏడాది పాటు సంపాదించే శాలరీని ఫ్రీలాన్స్ ద్వారా రెండు, మూడు నెలల్లో సంపాదిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి సిటీల్లో ఎప్పటి నుంచో ఈ ఫ్రీలాన్స్​ కల్చర్ ఉంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా చాలా రోజుల నుంచి ఉన్నా.. కొన్ని రంగాలకే పరిమితమై ఉండేది. ఇప్పడు చాలా రంగాలకు విస్తరిస్తున్నది. జాబ్ సెక్కూరిటీ కంటే సంపాదన, ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న వాళ్లు ఫ్రీలాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

చాలా రంగాలకు విస్తరణ

ఒకప్పుడు డీటీపీ, టెలికాలింగ్, డేటా ఎంట్రీ వంటి వాటికే పరిమితమైన ఫ్రీలాన్సింగ్.. ఇప్పుడు చాలా రంగాలకు విస్తరించింది. ఐటీ, కోడింగ్, టీచింగ్, రైటింగ్, హాస్పిటాలిటీ, రిటైల్, ఈకామర్స్, ట్యూటర్స్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేషన్, గ్రాఫిక్ డిజైన్, ఫైనాన్స్, ఫొటోగ్రఫీ తదితర రంగాల్లోనూ ఫ్రీలాన్స్ కల్చర్ కనిపిస్తున్నది. చిన్న కంపెనీలు కూడా ఫ్రీలాన్సర్స్ ద్వారానే వర్క్ చేయించుకుందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. పర్ఫెక్ట్​గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తే నెక్ట్స్ ప్రాజెక్టులకు మరింత హైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు.

ఆన్​లైన్ పోర్టల్స్ నుంచి..

ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని వెబ్​సైట్లలో రిజిస్టర్ అయితే మన క్వాలిఫికేషన్, స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి ఫ్రీలాన్స్ వర్క్ ఆఫర్లు వస్తుంటాయి. లింక్డ్ ఇన్ లాంటి జాబ్ పోర్టల్స్ ఫ్రీలాన్స్ జాబ్స్ సమాచారాన్ని అందిస్తున్నాయి. అలాగే ఫివేర్, ఫ్రీలాన్స్.కామ్, ట్రూలాన్స్, ఫ్రీలాన్స్ ఇండియా, అప్​వర్క్, సింప్లీ హైర్డ్, ఫ్లెక్స్ జాబ్స్, గురు తదితర వెబ్ పోర్టల్స్ ఫ్రీలాన్సర్ల కోసం పని చేస్తున్నాయి. ఆయా సైట్లలో మన విద్యార్హతలు, మన వర్క్, గంటకు ఎంత చార్జ్ చేస్తారు.. తదితర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సైట్లు ఫ్రీగానే ఈ సర్వీస్​ను అందిస్తున్నా.. మరికొన్ని మాత్రం 10 నుంచి 20%  దాకా ప్రాజెక్టు అమౌంట్​లో చార్జ్ చేస్తున్నాయి. కొన్ని కం పెనీలు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అమౌంట్ ఇవ్వకుం డా మోసం అవకాశం ఉంటుందని, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు కంపెనీ  పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీనియర్ ఫ్రీలాన్సర్లు సూచిస్తున్నారు.

ఫ్రీ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేస్కుంటున్న

వన్ ఇయర్ నుంచి ఫ్రీలాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాను. ఆఫీసుకు టైంకు వెళ్లాలి.. టాస్క్​లు కంప్లీట్ చేయాలనే టార్చర్ ఉండదు. ఫ్రీ టైంలోనే వర్క్ చేసుకుంటున్న. జాబ్ చేసే సమయంలో సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్న.
- రమేశ్, ఐటీ ఫ్రీలాన్సర్

ఓ కంపెనీలో వర్క్ చేస్తూనే..

ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూనే 5 నెలలుగా ఫ్రీలాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తున్నా. డేటా అనాలిసిస్, డిజిటల్ కంటెంట్, కంటెంట్ డెవలపర్​గా చేస్తున్నా. ఫ్రీటైమ్​లోనే చేస్తున్నా కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. ఫుల్ టైమ్ అయితే బానే సంపాదించవచ్చు. వర్క్ స్కిల్స్ ఉన్నవారికి ఈ ఫీల్డ్​లో మస్తు డిమాండ్.
- ప్రేమ్ కుమార్, ప్రైవేట్ ఎంప్లాయీ, ఫ్రీలాన్సర్