రుద్రంకోట మూవీకి మంచి రెస్పాన్స్​

రుద్రంకోట మూవీకి మంచి రెస్పాన్స్​

అనిల్ ఆర్కా హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకుడు.  సీనియ‌‌ర్ న‌‌టి జ‌‌య‌‌ల‌‌లిత స‌‌మ‌‌ర్పకులుగా వ్యవ‌‌హరిస్తూ  కీల‌‌క పాత్ర పోషించారు. విభీష‌‌, అలేఖ్య హీరోయిన్స్‌‌గా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.

 ‘200 థియేటర్స్‌‌లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌‌తో రన్ అవుతోంది.  అన్ని ఏరియాల నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి.  ఇంకా పెద్ద స‌‌క్సెస్ చేయాల‌‌ని ప్రేక్షకుల‌‌ను కోరుకుంటున్నాం’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.