Android 16 అధికారికంగా లాంచ్..సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు..కొత్త ఫీచర్లు

Android 16 అధికారికంగా లాంచ్..సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు..కొత్త ఫీచర్లు

గూగుల్ న్యూ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 16ను గూగుల్ మంగళవారం(జూన్10) అధికారికంగా లాంచ్ చేసింది. జూన్ 11నుంచి అందుబాటులోకి రానుంది. గత సెప్టెంబర్ లో సెలెక్టెడ్ యూజర్లు, బీటీ వెర్షన్ రిలీజ్ చేసిన గూగుల్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్ గూగుల్ పిక్సెల్ తో పాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్లకు సపోర్టు చేస్తుంది.. అంతేకాదు ఆండ్రాయిడ్ 16 అనేక కొత్త ఫీచర్లతో వస్తోంది. 

ఆండ్రాయిడ్ 16 మొదట Google Pixel ఫోన్లకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో Samsung, Xiaomi, OnePlus, Motorola, Nothing వంటి స్మార్ట్ ఫోన్లలో కూడా అందుబాటులోరానునుంది. 

ఆండ్రాయిడ్ 16 అనేక కొత్త ఫీచర్లతో వస్తోంది. 

లైవ్ అప్‌డేట్స్: ఇది ఐఫోన్ లైవ్ యాక్టివిటీస్‌కు సమానమైన కొత్త ఫీచర్. యాప్‌లు స్టేటస్ బార్‌లో, నోటిఫికేషన్‌లలో యాక్టివిటీస్ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని డైనమిక్ చిప్స్ లో చూపిస్తుంది. 

మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ : ఇది కొత్త డిజైన్ లాంగ్వేజ్.రకరకాల రంగులు, సహజమైన కదలిక, అడాప్టివ్ భాగాలు, ఫ్లెక్సిబుల్ టైపోగ్రఫీ ,కాంట్రాస్టింగ్ షేప్‌లపై దృష్టి పెడుతుంది. అయితే ఈ డిజైన్ ప్రారంభ రోల్‌అవుట్‌లో పూర్తిగా ఉండకపోవచ్చు ,తదుపరి క్వార్టర్లీ ప్లాట్‌ఫారమ్ రిలీజ్‌లలో (QPRలు) అందుబాటులో వస్తుంది.

రీడిజైన్డ్ క్విక్ సెట్టింగ్‌లు: నోటిఫికేషన్లు, నియంత్రణలను వేరుచేసే డ్యూయల్-ప్యానెల్ లేఅవుట్ ఉంటుంది.

బ్యాటరీ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్: బ్యాటరీ సామర్థ్యం,లైఫ్ ని ట్రాక్ చేసేందుకు కొత్త సిస్టమ్ జోడించారు.

ఇంప్రూవ్డ్ ఫోటో పికర్:ఈ ఫీచర్ కస్టమర్ల మీడియా లైబ్రరీకి యాప్‌లకు పూర్తి యాక్సెస్‌ను ఇవ్వకుండా నిర్దిష్ట ఫొటోలు, వీడియోలను సెలెక్ట్ చేసుకునేందుకు ప్రైవసీని మెరుగుపరుస్తుంది.

అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ వీడియో (APV) కోడెక్ సపోర్టు: ఆండ్రాయిడ్ 16 ఈ ప్రొఫెషనల్-గ్రేడ్ వీడియో ఫార్మాట్‌కు సపోర్టు చేస్తుంది. హైక్వాలిటీ వీడియో రికార్డిండ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ కెపాసిటీకి యాక్సెస్  ఉంటుంది. 

అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ (ARR) సపోర్టు: అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌లకు సపోర్టు  చేస్తుంది. డిస్‌ప్లేలు కంటెంట్ ఆధారంగా రిఫ్రెష్ రేట్‌ను డైనమిక్‌గా సర్దుబాటు చేసేందుకు అనుమతిస్తుంది.ఫలితంగా సున్నితమైన విజువల్స్,బ్యాటరీ సామర్థ్యం మెరుగుపడుతుంది.

నోటిఫికేషన్ కూల్‌డౌన్: ఈ ఫీచర్ తరచుగా వచ్చే నోటిఫికేషన్లు కూల్‌డౌన్  చేయడం ద్వారా నోటిఫికేషన్ ఓవర్‌లోడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
కస్టమ్ DND మోడ్‌లు: కస్టమర్లు సొంతంగా డోంట్ డిస్ట్రర్బ్ మోడ్లను క్రియేట్ చేసుకోవచ్చు. 

AI రైటింగ్ టూల్స్‌ను నిరోధించే కెపాసిటీ:ఈ ఫీచర్పాస్‌వర్డ్‌ల వంటి సున్నితమైన రంగాలలో AI రైటింగ్ సహాయం కనిపించకూడని చోట యాప్‌లకు కొత్త సిస్టమ్- లెవెల్ నియంత్రణకు అనుమతిస్తుంది.

అంతర్గత కోడ్‌నేమ్: ఆండ్రాయిడ్ 16 అంతర్గత కోడ్‌నేమ్ బాక్లవా.

 Android 16 తో స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు సరికొత్త అనుభవం లభిస్తుందని అంటోంది గూగుల్.