ఫోన్‌లో మోసం మాటలు వెంటనే గుర్తించే.. సరికొత్త ఫీచర్ గూగుల్ స్కామ్ కాల్ డిటెక్షన్

ఫోన్‌లో మోసం మాటలు వెంటనే గుర్తించే.. సరికొత్త ఫీచర్ గూగుల్ స్కామ్ కాల్ డిటెక్షన్

గూగుల్ స్కామ్ కాల్ డిటెక్షన్ అనే ఒక సరికొత్త సేఫ్టీ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. ఇది మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చే మోసపూరితమైన మాటలను కనిపెట్టి, మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులలాగ లేక మనకు తెలిసిన వాళ్ల లాగానో నటించి ఫోన్లు చేస్తున్నారు. క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందనో, లాటరీ వచ్చిందనో చెప్పి మన ఓటీపీలు, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇలాంటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడతుంది. మనం కాల్ లిఫ్ట్​ చేసినప్పుడు అవతలి వ్యక్తి మాట్లాడే మాట తీరులో తేడాను ఈ ఏఐ టెక్నాలజీ వెంటనే గమనిస్తుంది. ఇది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి అడిగే ప్రశ్నలను మన ఫోన్ లోపలే ఉన్న ఏఐ సిస్టమ్ జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. ఉదాహరణకు అవతలి వ్యక్తి ‘‘మీ అకౌంట్ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్, ఓటీపీ చెప్పండి” అనడిగితే, ఇది మోసపూరితమైన కాల్ అని వెంటనే గుర్తిస్తుంది. 

మరుక్షణమే మన ఫోన్ స్క్రీన్ మీద పెద్దగా ఒక హెచ్చరికను చూపిస్తుంది. అంతేకాదు ఫోన్ అలర్ట్​ సౌండ్​పాటు వైబ్రేట్ అవుతుంది. దాంతో మనం అలర్ట్ అయి వెంటనే కాల్ కట్ చేయొచ్చు. అయితే చాలామందికి మన మాటలు గూగుల్ వింటోందేమోననే డౌట్ రావొచ్చు. కానీ ఇక్కడ భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలన్నీ కేవలం మన ఫోన్​లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఈ వాయిస్ డేటా ఏ రికార్డు రూపంలోనూ సేవ్ అవ్వదు. గూగుల్ కంపెనీ సర్వర్లకు కూడా వెళ్లదు. ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది. 

ఓమ్ని.. ఓ మ్యాజిక్ టూల్! 

జెమిని ఓమ్ని అనేది గూగుల్ సృష్టించిన మ్యాజిక్ టూల్. నిజానికి ఇదొక మల్టీమోడల్ ఏఐ టూల్. ఇది కేవలం టెక్స్ట్ రాయడానికి, ఫొటోలు మార్చడానికి మాత్రమే కాదు. మీరు దీనికి కొన్ని డైలాగ్స్, ఫొటోలు, ఒక ఆడియో క్లిప్ ఇస్తే చాలు.. వాటన్నింటినీ అందంగా మేళవించి ఒక అద్భుతమైన సినిమా లెవెల్ వీడియోను క్షణాల్లో మీ కళ్లముందు ఉంచుతుంది. దీనికి మన రియల్ వరల్డ్​పై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఇది క్రియేట్ చేసే వీడియోలు కార్టూన్లలా కాకుండా, సహజంగా కనిపిస్తాయి. ఇక ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోసం కూడా ఎలాంటి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నేర్చుకోవాల్సిన పనిలేదు. 

ఒక ఫ్రెండ్​తో మాట్లాడినట్లు ‘‘వెనుక బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మార్చు’’ లేదా ‘‘బట్టల రంగు మార్చు’’ అని చెప్తే చాలు, మీరు ఇచ్చిన కమాండ్స్​కు తగ్గట్టువీడియోను మార్చేస్తుంది. ఇది ఇప్పుడు గూగుల్ ప్రీమియం ప్లాన్స్ ఉన్నవారితో పాటు, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి అందుబాటులో ఉంది. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, మీ ఊహలకు ప్రాణం పోసి మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చే పవర్ ఈ జెమిని ఓమ్నికి ఉంది.