గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్షన్.. ఫ్యుయెల్ ఎఫిషియెంట్ రూట్స్.. పెట్రోల్ ఆదా అయ్యే మార్గమిది !

గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్షన్.. ఫ్యుయెల్ ఎఫిషియెంట్ రూట్స్.. పెట్రోల్ ఆదా అయ్యే మార్గమిది !

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇంధన ఖర్చును తగ్గించుకునే మార్గాల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి గూగుల్ మ్యాప్స్ ‘ఫ్యుయెల్ ఎఫిషియెంట్​ రూట్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌‌ను ఆన్ చేస్తే ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ సంఖ్య, రహదారి పరిస్థితులు, ఎత్తుపల్లాలు వంటి అంశాలను విశ్లేషించి ఫ్యుయెల్​ ఎక్కువ ఖర్చు కాకుండా ఉండే రూట్​ని సూచిస్తుంది. దీంతో అనవసరంగా ట్రాఫిక్‌‌లో ఎక్కువసేపు నిలిచిపోవడం తగ్గి, పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చులో కొంత మేర ఆదా అయినట్టే.

►ALSO READ | జ్యోతిష్యం:జూన్15 శక్తివంతమైన అమావాస్య.. ఆడవారు ఈ పనులు అస్సలు చేయొద్దు..!

ముఖ్యంగా ప్రతిరోజూ ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర పనుల కోసం ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వాడాలంటే గూగుల్ మ్యాప్స్​ యాప్‌‌ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఫొటోపై నొక్కి సెట్టింగ్స్​లోకి వెళ్లాలి. అక్కడ నావిగేషన్​ను సెలక్ట్ చేసి, రూట్ ఆప్షన్స్ విభాగంలో ఉన్న ప్రిఫర్ ఫ్యుయెల్ ఎఫిషియెంట్ రూట్స్​ అనే ఆప్షన్​ని ఆన్ చేయాలి. తర్వాత వెహికల్​ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్​ లేదా ఎలక్ట్రిక్​.. ఏదైతే అది సెలక్ట్ చేసి, గూగుల్ మ్యాప్స్ దానికి అనుగుణంగా ఫ్యుయెల్​ని సేవ్ చేసే రూట్లను సూచిస్తుంది.