7వ శతాబ్దం కథాంశంతో గోపీచంద్.. మెస్మరైజ్ చేస్తున్న గ్లింప్స్

7వ శతాబ్దం కథాంశంతో గోపీచంద్.. మెస్మరైజ్ చేస్తున్న గ్లింప్స్

గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గురువారం (june 12) గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. 

ఇందులో గోపీచంద్ డిఫరెంట్ గెటప్‌‌‌‌లో  మెస్మరైజ్ చేస్తున్నాడు.  పొడవాటి జుట్టు, నుదిటిపై వీర తిలకం, చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలోకి దిగిన యోధుడిలా ఇంటెన్స్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.  ఇక గ్లింప్స్ విషయానికొస్తే..  మంచుతో కప్పబడిన  పర్వత శ్రేణుల మధ్య.. సైనిక శిబిరం నుంచి బయటికి వచ్చిన గోపీచంద్  తాను ప్రేమగా పెంచిన గుర్రం తలపై తన తలతో నిమురుతూ కనిపించాడు. 

బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో ‘ధీర ధీర’ అంటూ వచ్చే మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న  33వ సినిమా ఇది.  7వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా, ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో వేసిన భారీ సెట్‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది.  ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.