Vishwam First Strike: గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ విశ్వం.. ఈసారి రాసిపెట్టి ఉందట!

Vishwam First Strike: గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ విశ్వం.. ఈసారి రాసిపెట్టి ఉందట!

మాస్ హీరో గోపీచంద్(Gopichand), దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 

మరోసారి గోపీచంద్ O సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ.. ఈ సినిమాకు విశ్వం(Vishwam) అనే మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. టీజర్ వీడియో చాలా స్టైలీష్ అండ్ రిచ్ గా ఉంది. టీజర్ మొదలవగానే గన్ తో ఓ ఫంక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. అందరినీ చంపేసి చివరకు ఫంక్షన్లో ఉన్న బిర్యానీని తింటూ.. ప్రతి అన్నం మెతుకు మీద అది ఎవరు తినాలో రాసి పెట్టి ఉంటుంది. దీనిపై నా పేరు రాసిపెట్టి ఉంది అని కూల్ గా డైలాగ్ చెప్పాడు. దాంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.