అద్భుతం.. అమ్మ చెక్కిన బొమ్మ..50 ప్రదర్శనల అభినందన వేడుక

అద్భుతం.. అమ్మ చెక్కిన బొమ్మ..50 ప్రదర్శనల అభినందన వేడుక

గచ్చిబౌలి, వెలుగు: విజయవంతంగా 50 నాటక ప్రదర్శనలు పూర్తి చేసిన సందర్భంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో గోవాడ క్రియేషన్స్ - హైదరాబాద్ 50 ప్రదర్శనల అభినందన వేడుక నిర్వహించారు. మంగళవారం గచ్చిబౌలి ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీలోని రంగభూమి సెంటర్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ‘అమ్మ చెక్కిన బొమ్మ’ పేరిట డా. గోవాడ వెంకట్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకం ఆద్యంతం అద్భుతంగా సాగింది.