లోక్ భవన్‌‌‌‌‌‌లో ఆయుధ పూజ..దుర్గామాతకు, పోచమ్మ తల్లికి గవర్నర్ ప్రత్యేక పూజలు  

లోక్ భవన్‌‌‌‌‌‌లో ఆయుధ పూజ..దుర్గామాతకు, పోచమ్మ తల్లికి గవర్నర్ ప్రత్యేక పూజలు  

హైదరాబాద్, వెలుగు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం లోక్ భవన్‌‌‌‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుర్గామాతకు, పోచమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం భద్రతా విధుల్లో వినియోగించే ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు.

లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌‌‌‌ బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్ స్పెషల్ సీఎస్  దాన కిశోర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

నాదర్‌‌‌‌గుల్‌‌‌‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాద ఘటనపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీటెక్ విద్యార్థిని మృతి అత్యంత బాధాకరమని పేర్కొంటూ.. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు.