ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌ .. 14 జూన్ వరకు పొడిగింపు .. అప్‌డేట్‌ చేసుకోండిలా..

ఆధార్  ఫ్రీ అప్‌డేట్‌ ..  14 జూన్ వరకు పొడిగింపు .. అప్‌డేట్‌ చేసుకోండిలా..

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మరో మూడు నెలల గడవు పొడిగించింది యూఐడీఏఐ.  2024  జూన్ 14 వరకు ఫ్రీగా ఆధార్ ను  అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉన్న వారు గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోని వారు తమ ఆధార్ ని కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  అలాగే 5 ఏళ్లలోపు పిల్లల ఆధార్ సైతం అప్డేట్ చేసుకోవాలి. అలాంటి వారు ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతోంది.  మై ఆధార్ పోర్టల్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.  ఆధార్ అప్ డేట్ వల్ల వ్యక్తుల డేటా అక్యురేట్‌గా ఉంటాయి.

అప్‌డేట్‌ చేసుకోండిలా..

* https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. 
*  ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి
* అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
* రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్‌ అప్‌డేట్‌’పై క్లిక్‌ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. 
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. 
* 14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీరు ఉచితంగా అప్‌డేట్ చేయగల వివరాలు

పేరు
చిరునామా
పుట్టిన తేదీ/వయస్సు
లింగం
మొబైల్ నంబర్
ఇమెయిల్ చిరునామా
రిలేషన్ షిప్ స్టేటస్