పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రాంమోహన్‌ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సామ రాంమోహన్‌ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వాలి
  • మంత్రి శ్రీధర్‌బాబు 

గండిపేట : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన సామా రాంమోహన్​ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మినిస్టర్​ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా విద్యావంతులు, ఉద్యోగులు నిలవాలని విజ్ఞప్తి చేశారు.  

అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి పని చేయాలన్నారు. ఏఐపీసీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి,  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ధారాసింగ్‌ జాదవ్‌, పీసీసీ లీడర్లు పాల్గొన్నారు.