నవంబర్ 6లోపు గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

నవంబర్ 6లోపు గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహబూబ్ నగర్–హైదరాబాద్– రంగారెడ్డి పట్టభద్రుల సెగ్మెంట్ అసెంబ్లీ (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం నవంబర్ 6 లోపు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓ  కె. రామకృష్ణ ఒక ప్రకటనలో కోరారు. 

డిగ్రీ పాసై ఉండాలన్నారు. జాబితాను పూర్తిగా కొత్తగా తయారు చేస్తున్నందున గతంలో ఓటర్లుగా ఉన్నవారు సైతం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన వారు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఫారం-18 సమర్పించాల్సి  ఉంటుందన్నారు. https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx వెబ్‌‌సైట్ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలన్నారు.