మెగాస్టార్ భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్..

మెగాస్టార్  భోళాశంకర్  ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్..

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భోళాశంకర్ (Bhola Shankar) మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా భోళాశంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల (ఆగష్టు 6న) హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్ సాయంత్రం 7 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ కానుందని తెలిపారు. 

ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. దీంతో మెగా ఈవెంట్ ను చూడటానికి చిరంజీవి ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుండటంతో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేయునున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది మేకర్స్ ప్రకటించలేదు.   

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ అండ్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ భోళా మాస్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్  పైన ఫోకస్ పెట్టారు మేకర్స్. 

తమిళ చిత్రం వేదాళం కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది. ఈ సినిమాలో త‌మ‌న్నా (tamanna bhatia) హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్ర‌లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerti suresh) క‌నిపించ‌నుంది. టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. ఏకె ఎంటెర్టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర(Rama brahmam sunkara) నిర్మిస్తున్నారు.