
సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారి కోసం సపోర్ట్‌గా నిలిచేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’పేరుతో నిర్మాత దిల్ రాజు ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. హీరో విజయ్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వెబ్ సైట్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశా. ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఇప్పుడు లాంచ్ చేసిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ లక్షలాది మందికి హోప్‌ని ఇస్తుంది’అని చెప్పాడు. ఇదొక గొప్ప ఫ్లాట్ ఫామ్ అని, సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్‌గా పెట్టుకోవాలని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వారిని ఎంకరేజ్ చేసేందుకే ఈ సైట్‌ను స్టార్ట్ చేశాం. యంగ్ జనరేషన్‌తో ఈ టీమ్ ఫామ్ చేశాం. ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్ ఫామ్‌ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతోంది.
అదే సమయంలో దిల్ రాజు డ్రీమ్స్ అధికారిక కార్యకలాపాలు జూలై 1న ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మొదటి ప్రాజెక్ట్ జూలై చివరి నాటికి ఫిక్స్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీకి రావాలనుకునే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అని చెప్పారు.
Serving dreams with a side of smiles! 🤩#DilRajuDreams family at the Grand Lunch Celebration!✨#DilRaju @DilRajuDreams pic.twitter.com/AxzapaYZ4y
— Sri Venkateswara Creations (@SVC_official) June 28, 2025