చట్నీలు, కూరలు, స్వీట్ల కోసం వంటింట్లో రెగ్యులర్‌గా కొబ్బరిని తురుముతుంటారు. కానీ.. అది చాలా శ్రమతో కూడుకున్న పని. దానివల్ల చేతులు నొప్పులు రావడమే కాకుండా కొన్నిసార్లు గాయాలవుతుంటాయి. అలాంటప్పుడు ఈ గాడ్జెట్ ఉంటే క్షణాల్లో ఎలాంటి శ్రమ లేకుండా కొబ్బరిని తురుముకోవచ్చు. దీన్ని సౌభాగ్య అనే బ్రాండ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఇది కొబ్బరిని సౌత్ ఇండియన్ చట్నీలకు సరిపోయేలా పర్‌ఫెక్ట్‌గా తురుముతుంది. ఈ మెషిన్‌తో కత్తులకు పదును కూడా పెట్టుకోవచ్చు. అందుకోసం ప్యాకేజీలో ప్రత్యేకంగా ఒక షార్ప్‌నర్ అటాచ్‌మెంట్ కూడా వస్తుంది. దాన్ని అటాచ్ చేసి మెషిన్ రన్నింగ్ మోడ్‌ని మారిస్తే సరిపోతుంది. ఇది చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించే కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. అందువల్ల వంటగది కౌంటర్‌టాప్‌పై సులభంగా సర్దుకోవచ్చు. విడిభాగాలను సులభంగా తొలగించి క్లీన్ చేసుకోవచ్చు. దీని ధర రూ.2799
