నగర వాసులకు గుడ్ న్యూస్..జూన్ లోగా సంతోష్ నగర్ ఫ్లైఓవర్ పూర్తి

నగర వాసులకు గుడ్ న్యూస్..జూన్ లోగా సంతోష్ నగర్ ఫ్లైఓవర్ పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్: పాతబస్తీలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంచల్‌గూడ - సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనులపై జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం నిర్మాణంలో ఉన్న సంతోష్ నగర్ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల వేగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులను మరింత స్పీడప్ (Speed up) చేయాలని సూచించారు.

జూన్ నెలే  డెడ్ లైన్ 

నగరవాసులకు త్వరగా ఈ బ్రిడ్జి సేవలు అందుబాటులోకి రావాలని, జూన్ నెల చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలను డెడ్ లైన్ గా పెట్టుకుని, షెడ్యూల్ ప్రకారం మిగిలిన పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక అడ్డంకులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.