గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ రూ. 7 వేల 937 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ రూ. 7 వేల 937 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2024 -23 వార్షిక బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 7 వేల 937 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారు. ప్రభుత్వం నుండి రూ. 3 వేల 492 కోట్లు కోరుతూ కౌన్సిల్ ఆమోద మద్ర వేసింది. శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్ పై విచారణకు కూడా కౌన్సిల్ ఆమోదించింది. కార్పొరేటర్లు చేసిన ఆరోపణల పై ప్రత్యేక కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు ఉన్న అధికారులను ప్రభుత్వానికి సరేండర్ లేదా ఇతర శాఖలకు పంపాలని కౌన్సిల్ తెలిపింది.