అపార్ట్‌మెంట్లలో భారీగా మంటలు.. ఇళ్లు వదిలేసి పరిగెత్తిన జనం

అపార్ట్‌మెంట్లలో భారీగా మంటలు.. ఇళ్లు వదిలేసి పరిగెత్తిన జనం

గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని కొన్ని అపార్ట్‌మెంట్లలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది.

ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఎత్తైన అపార్ట్మెంట్ సొసైటీలోని ఫ్లాట్లలో భారీ మంటలు చెలరేగడాన్ని చూపిస్తుంది.

ఒక్కసారిగా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అక్కడి వాతావరణమంతా గందరగోళానికి గురైంది. అనంతరం బిస్రఖ్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 

https://twitter.com/PTI_News/status/1651120828053065729