రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేడు రక్షా బంధన్ (రాఖీ) పండుగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆప్యాయత, నమ్మకానికి, అన్నాచెల్లెల్లు/అక్కాతమ్ముడు మధ్య విడదీయరాని బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ఈ పండుగ మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలని, మహిళల పట్ల గౌరవాన్ని పెంచాలని కోరుకుంటున్నట్టు ముర్ము ఈ సందర్భంగా తెలిపారు.