అరె బాబు.. స్విమ్మింగ్ ఫుల్ కాదు క్రికెట్ స్టేడియం: వర్షంలో గ్రౌండ్స్‌మెన్ రైన్ డ్యాన్స్.. వీడియో వైరల్!

అరె బాబు.. స్విమ్మింగ్ ఫుల్ కాదు క్రికెట్ స్టేడియం: వర్షంలో గ్రౌండ్స్‌మెన్ రైన్ డ్యాన్స్.. వీడియో వైరల్!

Groundsmen Rain Dance: వర్షం వస్తే సాధారణంగా మ్యాచ్ ఆగిపోయి ఆటగాళ్లు, అభిమానులు బోర్ కొడుతూ కూర్చుంటారు. కానీ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో మాత్రం వరుణుడి ఆటంకం కూడా ఒక పెద్ద పండుగలా మారిపోయింది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెయింట్ లూసియా కింగ్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను భారీ వర్షం ముంచెత్తింది. అయితే మైదానాన్ని కవర్లతో కప్పడానికి వచ్చిన గ్రౌండ్స్ సిబ్బంది చేసిన హంగామా చూసి గ్రౌండ్ లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. వర్షంలో తడుస్తూనే వారు వేసిన రైన్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

కవర్లు కప్పుతూనే కరేబియన్ రైన్ డ్యాన్స్: 

మ్యాచ్ మధ్యలో వర్షం ప్రారంభం కాగానే పిచ్‌ను భద్రపరిచేందుకు కవర్లు పట్టుకుని పరుగెత్తుకొచ్చిన గ్రౌండ్స్‌మెన్, తమ బాధ్యతను ముగించాక ఆగిపోలేదు. స్టేడియం స్పీకర్లలో వస్తున్న ఉత్సాహపూరితమైన పాటలకి అనుగుణంగా protective కవర్ల పైనే క్రేజీ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టారు. ఈ డ్యాన్స్ చూసిన వాళ్లు అరె బాబు.. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు, క్రికెట్ స్టేడియం అంటూ కామెంట్స్ చేసినప్పటికీ, వారు వేసిన డ్యాన్స్ స్టేప్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. మ్యాచ్ ఆగిపోయిందనే నిరాశను క్షణాల్లో తుడిచిపెట్టేసి, మైదానాన్ని ఒక కరేబియన్ కార్నివాల్‌లా మార్చేశారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ గ్రౌండ్స్‌మెన్ ఎనర్జీని తెగ పొగిడేస్తున్నారు.

డ్రామా మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ గ్రాండ్ విక్టరీ: 

గ్రౌండ్స్‌మెన్ వినోదం ముగిసిన కాసేపటికి వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ పునఃప్రారంభమైంది. వర్షం కారణంగా ఓవర్లను కుదించడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి వర్తింపజేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు 3 వికెట్ల తేడాతో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై డ్రమాటిక్ విజయాన్ని సాధించింది. గ్రౌండ్ లో ఆటగాళ్ల థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్, బయట గ్రౌండ్స్‌మెన్ రైన్ డ్యాన్స్ కలగలిపి ఈ మ్యాచ్ CPL 2026 సీజన్‌లోనే ఒక మెమరబుల్ మూమెంట్ గా నిలిచిపోనుంది.