గృహహింస చట్టంలో మార్పులు డిమాండ్ చేస్తూ.. 1700 అడుగుల కొండపై నుంచి దూకిన వ్యక్తి

గృహహింస చట్టంలో మార్పులు డిమాండ్ చేస్తూ.. 1700 అడుగుల కొండపై నుంచి దూకిన వ్యక్తి

వైవాహిక జీవితంలో అసంతృప్తి, భార్యతో నిత్యం గొడవలు, గృహహింస కేసు, అత్తింటివారి వేధింపులు తాళలేక ఒక వ్యక్తి 1700 అడుగుల కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసిన 13 నిమిషాల వీడియో వైరల్ గా మారింది. గృహహింస చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ చనిపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింద.ి 

గుజరాత్‌కు చెందిన విశ్వరాజ్ గోహిల్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ ప్రాంతంలోని కొంకణకడా కొండ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే  ముందు 13 నిమిషాల వీడియో రికార్డ్ చేశాడు. గృహ హింస, వివాహ సంబంధిత చట్టాలను సమీక్షించాలని అధికారులను కోరాడు.

విశ్వరాజ్ గోహిల్ రాజ్‌పరా కు చెందిన వ్యక్తి. తింబా పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేవాడు. తనకు జీవితంపై  ఇక ఆశ లేదని చెబుతూ వీలైనంత ఎక్కువ మందికి చేరేలా సేర్ చేయాలని కోరాడు.  498ఏ సెక్షన్ భర్త లేదా ఆయన బంధువులు చేసే వేదింపుల సంబంధిత కేసులపై వీడియోలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. 

దాంపత్య వివాదం, పోలీసు, కోర్టు వ్యవహారాలు

ఆయన భార్య ధారాబా సెప్టెంబర్ 12న గృహ హింస, దాంపత్య సమస్యలపై పోలీసులకు దరఖాస్తు ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత్తవారింట్లో (అంజనీ సిటీ, కలియాబిడ్) సంభాషణ సమయంలో గోహిల్ చేతి రక్తనాళాలు కోసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన మామ నీలంబాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 9న  హింస కేసు సంబంధించి  కోర్టులో హాజరయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి బయటికి వెళ్తున్నట్లు చెప్పి మోటార్‌సైకిల్ తీసుకుని వెళ్లిపోయాడు..

ఆ తర్వాత  మహారాష్ట్రలోని హరిశ్చంద్రగడ్‌కు చేరుకుని కొండ నుంచి దూకి మరణించాడు. కాకెన్‌వాడా పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతి కేసుగా చెబుతూ ఎఫ్ఐఆర్  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు పంపారు.