Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్

Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పటాస్(Patas) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ రవి, శ్రీముఖి చేసిన ఈ కామెడీ షో ఎంతో మంది ఆడియన్స్ ను అలరించింది. అయితే.. ఈ షో ద్వార ఎంతో మంది కొత్త కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ లాంటివాళ్లు అలా వచ్చిన వాళ్ళే. వారిలో ఒకరు భాస్కర్(Bhaskar). ఈ షోలో తన కామెడీతో ఆడియన్స్ ను మెప్పించిన గల్లీ బాయ్ భాస్కర్.. తర్వాత పలు టీవీ షోలతో పాల్గొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తిపును తెచ్చుకున్నాడు. ఆ ఫేమ్ తోనే ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో స్కిట్స్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజగా తన డ్రీం ఫుల్ ఫిల్ చేసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో ఓక పోస్ట్ చేశాడు భాస్కర్. ఆ డ్రీం మరేమిటో కాదు.. కొత్త ఇల్లు. అవును భాస్కర్ రీసెంట్ పైగా తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. ఆ వేడుకకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోకి.. నా డ్రీమ్ హౌస్..  నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ భాస్కర్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం భాస్కర్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.