గుంజీ గుంజీ పాట వివాదం.. హీరో చంద్రహాస్పై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు

గుంజీ గుంజీ పాట వివాదం.. హీరో చంద్రహాస్పై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు

బరాబర్ ప్రేమిస్తా.. ఆడియో ఫంక్షన్ లో సినిమా హీరో చంద్రహాస్ పాడిన గుంజీ గుంజీ.. పాట తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ వివాదానికి సంబంధించి చంద్రహాస్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్టేజ్ పై బూతు పాట పాడి అవమానించినట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బుధవారం (ఫిబ్రవరి 04) బరాబర్ ప్రేమిస్తా.. సినిమా ఆడియో ఫంక్షన్ గందరగోళంగా మారింది. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ పాడిన పాటలో బూతులు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనిపై క్షమాపణ చెప్పాలని అడిగితే చంద్రహాస్ స్పందించిన తీరుపై ఫంక్షన్ కు వచ్చిన అతిథులు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా వచ్చిన జేడీ చక్రవర్తి కూడా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రముఖ టీవీ ఎడిటర్  చేసిన  ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.