GunturKaaram : మీనాక్షి మీమ్స్ చూశారా! చూస్తే నవ్వు ఆపుకోలేరు అంతే!

GunturKaaram : మీనాక్షి మీమ్స్ చూశారా! చూస్తే నవ్వు ఆపుకోలేరు అంతే!

ఖిలాడీ (Khiladi) బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మహేష్ బాబు (Mahesh babu), వరుణ్ తేజ్(Varun Tej) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తోన్న గుంటూరు కారం రిలీజ్కు ఉండటంతో తెగ ట్రోల్ అవుతుంది. అదేంటి..సినిమా రిలీజ్ అవుతుంటే..ట్రోల్ అవ్వడం ఏంటనుకుంటున్నారా? 

అయితే వివరాల్లోకి వెళ్తే..గుంటూరు కారం సినిమా నుంచి..మహేష్ బాబు పోస్టర్స్తో పాటు..హీరోయిన్స్ ఫొటోస్ కూడా షేర్ చేశారు మేకర్స్.ఇక రీసెంట్గా బ్యూటీ మీనాక్షి చౌదరి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రాజీ పాత్రలో నటించినట్లు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. 

అయితే ఈ బ్యూటీకి వచ్చిన కష్టమంతా..ఈ పోస్టర్లో మహేష్ బాబు కుర్చీలో కూర్చొని ఉండగా..వెనుక నిల్చొని హీరోపై చేతులు వేసి ఉండటమే. ఈ పోస్టర్లో మీనాక్షి చాలా చక్కటి అభినయంతో కనిపిస్తోంది. దీంతో రిలీజ్ చేయగానే పోస్టర్ అందరికీ నచ్చేసింది. కానీ, మహేష్ వెనుకాల నిల్చునే, ఆ పోజ్ చూశారా..అచ్చం మహేష్కు మసాజ్ చేసినట్టు..క్రియేట్ చేస్తూ సరదాగా అనేక మీమ్స్కు బలి అవుతోంది.

అంతేకాదు..హీరో మహేశ్ స్థానంలో అంతకుముందు సేమ్ అలాగే కూర్చొని ఉన్న..వేరే సెలబ్రిటీలను పెట్టి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఛత్రపతి లోని కాట్రాజ్.. లక్ష్మీ సినిమాలో బ్రహ్మీ, విజయ్ దేవరకొండ గీత గోవిందం స్టిల్స్తో  క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు మీమర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో గుంటూరు కారం అని సెర్చ్ చేస్తే చాలు..మీనాక్షి మీమ్సే దర్శనం ఇస్తున్నాయి. అది చూసిన నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. దీంతో ఇన్నాళ్లు హాట్ ఫొటోస్తో సోషల్ మీడియాను షేక్ చేసిన మీనాక్షి..ఇప్పుడు మీమ్స్తో ఫేమస్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మీమర్స్ చాలా తెలివి ఉన్నవాళ్లు సామి.