ఐటీ ఉద్యోగులు అయిన భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య : మరో లోకం గురించి లేఖలో ప్రస్తావన..?

ఐటీ ఉద్యోగులు అయిన భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య : మరో లోకం గురించి లేఖలో ప్రస్తావన..?

భార్యాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులే...మూడేళ్ళ క్రితమే పెళ్లయ్యింది. సిటీలో మంచిగా సెటిల్ అయ్యారు. హ్యాపీగా సాగుతోందని అనుకున్న వారి జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ...మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నామంటూ.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్ లో జరిగింది ఈ ఘటన. శనివారం ( అక్టోబర్ 17 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కేరళకు చెందిన మహమ్మద్ అస్లాం, ఫర్హానా దంపతులు  ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అస్లాం తన కొలీగ్స్ కి ఈమెయిల్ పంపాడు. అందులో తాము ఉంటున్న ఇంటి ఓనర్ నంబర్, తల్లిదండ్రుల నంబర్లు రాసి.. మేము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాము. ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు తెలియజేయండి అని ఉంది. ఈమెయిల్ చూసిన అస్లాం కొలీగ్స్ ఇంటి ఓనర్ కి విషయం చెప్పి అస్లాం ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లారు.

ఫ్లాట్ లో అస్లాం, ఫర్హానాలు విగతజీవులుగా పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. ఫర్హానా మెడపై గాయం కూడా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఫ్లాట్‌లో ‘మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము’ అని రాసి ఉన్న ఒక లెటర్ పోలీసులు గుర్తించారు పోలీసులు. ఫర్హానా దుస్తులపై ‘ఐ లవ్ యు’ అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫ్లాట్ లో ఉన్న లెటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను, అపార్ట్‌మెంట్ నుండి స్వాధీనం చేసుకున్నారు.

అస్లాం ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్యను హత్య చేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు, అయితే పోస్ట్‌మార్టం తర్వాతే అసలు నిజాలు తెలుస్తాయని అన్నారు పోలీసులు.

అస్లాం, ఫర్హానాలకు ఎలాంటి వైవాహిక సమస్యలు లేవని అంటున్నారు కుటుంబసభ్యులు. వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారని అంటున్నారు. అస్లాం సుమారు 18 నెలలుగా డిప్రెషన్‌కు చికిత్స, థెరపీ తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఉన్నాయని ఎన్నడూ అస్లాం కానీ ఫర్హానా కానీ తమకు చెప్పలేదని అంటున్నారు.

ఐటీ జాబ్ లో ఉండే ప్రెజర్ వల్లే అస్లాం, ఫర్హానాల ఆత్మహత్యకు కారణమని అంటున్నారు కొలీగ్స్. తమకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు.