హెచ్1 బి వీసాలకు సెకండ్ రౌండ్ లాటరీ

హెచ్1 బి వీసాలకు సెకండ్  రౌండ్  లాటరీ

వాషింగ్టన్: వచ్చే ఏడాది (2024) హెచ్1బీ వీసాలకు త్వరలోనే రెండో రౌండ్  లాటరీ సెలెక్షన్  నిర్వహిస్తామని అమెరికా ఫెడరల్  ఇమిగ్రేషన్  సంస్థ యూఎస్  సిటిజన్ షిప్  అండ్  ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తెలిపింది. అప్లికేంట్లు గతంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లలో అదనంగా వచ్చిన రిజిస్ట్రేషన్లను ర్యాండమ్ సెలెక్షన్ పద్ధతిలో  సెలెక్ట్  చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు యూఎస్ సీఐఎస్  గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

2024 ఏడాదికి హెచ్ 1బీ వీసాల కోసం సరిగ్గా సమర్పించిన ఎలక్ట్రానిక్  రిజిస్ట్రేషన్లకు ఈ ఏడాది మార్చిలోనే ర్యాండమ్ సెలెక్షన్  ప్రాసెస్  చేపట్టామని తెలిపింది. ‘‘రెండో రౌండ్  ప్రాసెస్  పూర్తిచేశాక తదుపరి తేదీని ప్రకటిస్తం. సెలెక్టెడ్  రిజిస్ట్రేషన్లతో అప్లికేషన్లు సమర్పించిన అభ్యర్థులందరికీ ఇప్పటికే నోటిఫై చేశాం” అని యూఎస్  సీఐఎస్  తెలిపింది. 2024 ఏడాదికి సెలెక్టెడ్  రిజిస్ట్రేషన్లతో దరఖాస్తులు సమర్పించిన అప్లికేంట్లు మాత్రమే హెచ్ 1బీ వీసా పొందేందుకు అర్హులని యూఎస్ సీఐఎస్  స్పష్టం చేసింది.