
బిడ్డ పుట్టిందో లేదో.. చాలామంది జ్యోతిష్య నిపణులు దగ్గరకు ఉరుకులు పరుగులు పెడతారు. జాతకం ఎలా ఉంది.. ఆరోగ్యం..విద్య.. ఉద్యోగం ఎలా ఉంటాయి.. ఏఏ గ్రహాలు అనుకూలిస్తాయి.. చెడు దృష్టితో ఏ గ్రహాలున్నాయి.. మొదలగు వాటి గురించి తెలుసుకోవడానికి పడే తాపత్రయం అంతా కాదు.జ్యోతిష్యం ప్రకారం జాతకంలో కేతు గ్రహం బలహీనంగా ఉంటే తరచుగా అశుభఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. వాటికి పరిష్కార మార్గాలను పరిశీలిద్దాం. . .
జ్యోతిష్యంలో కేతు గ్రహాన్ని ఒక ఛాయాగ్రహంగా చెప్తారు. ఇది ఆధ్యాత్మికత, వైరాగ్య, కర్మ సంబంధిత విషయాలతో ముడిపడి ఉంటుంది. జాతక రీత్యా కేతువు బలహీనంగా ఉంటే అలాంటి వ్యక్తుల్లో గందరగోళ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అస్థిరత, మానసిక అశాంతి వంటివి కలుగుతాయి.
తలలో సమస్య: జాతక రీత్యా కేతువు బలహీనంగా ఉంటే తరచు తలలో అనేక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. తలలో దురద రావడం.. తలనొప్పి రావడం.. అకస్మాత్తుగాతల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు కేతు గ్రహాన్ని శాంతింప చేసేందుకు.. కొన్ని నివారణ చర్యలు పాటించాలి. తొమ్మిది ముఖాల రుద్రాక్ష, అశ్వగంధ మూలికా తైలాన్ని తలకు రాసుకోవాలి. వైడూర్య రత్నమాలను ధరించాలని పండితులు సూచిస్తున్నారు.
ఆకలి : ఒక్కొక్కరికి ఎంత తిన్నా సరే ఆకలి తీరదు. వివిధ రకాల పదార్దాలను పదే పదే తింటాడు. జాతకంలో .. శని.. బుదుడు కలయిక వలన ఇలాంటివి కలుగుతాయి. ఇలాంటి వారు ఎక్కువుగా ఆకుపచ్చ రంగులు ధరిస్తే ఉపశమనం పొందుతారు. శనివారం నల్లని దుస్తులు ధరించి...శనిభగవానుడికి ప్రత్యేక పూజలు చేయండి.
పనుల్లో ఆటంకం : కొంతమంది చేపట్టిన పనులు మొదట్లో వేగవంతంగా జరిగినా.. తరువాత ఏవో కొన్ని కారణాల ఆటంకాలు ఏర్పడుతాయి. వీరి జాతకంలో.. చంద్రుడు వక్ర దృష్టితో ఉంటే అనుకున్న పనులు సాగవు. అలాంటివారు సోమవారం శివుడిని పూజించి.. రుద్రాభిషేకం చేయండి.
జ్ఞాపకశక్తి లోపం: శుక్రుడు అశుభ స్థానంలో ఉన్న వారికి ఏ విషయం గుర్తుండదు. చేద్దామనుకున్న పని మర్చిపోతారు. శుక్రుడిని శాంతింపజేసేందుకు శుక్రవారం గులాబీ పూలతో రుద్రాక్షలను పూజించండి. ప్రతి గురువారం తలకు ఆముదం రాసుకోంది. వజ్రాన్ని ధరించడం వలన జాతకంలో శుక్రుడు బలపడతాడని పండితులు చెబుతున్నారు.
కోపం రావడం: జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే.. ప్రతి చిన్న విషయానికి అసహనంగా ఉంటారు. తరచూ గొడవలు వస్తాయి. మీరు ఏది చెప్పిన ఎదుటి వారు మిమ్మలను అర్దం చేసుకోకుండా గొడవలకు దిగుతారు. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వల్ల ఇలాంటి గొడవలు జరుగుతాయి. కుజ గ్రహాన్ని శాంతింపజేయడానికి, మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేయండి.. ఆకుపూజ చేయండి.. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.