Health tips: జుట్టుకు కలర్ వేసుకుంటున్నారా?.. మార్కెట్లో దొరికే హెయిర్ డై సేఫేనా!..CDSCO ఏం చెబుతోందంటే..

Health tips: జుట్టుకు కలర్ వేసుకుంటున్నారా?.. మార్కెట్లో దొరికే హెయిర్ డై  సేఫేనా!..CDSCO  ఏం చెబుతోందంటే..

ప్రస్తుతం అందరికి ఒకటే సమస్య.. జుట్టు తెల్లబడిపోవడం.. ఒకప్పుడు 40 ఏళ్లు దాటితే గానీ కనిపించని తెల్ల జుట్టు ఇప్పుడు ఇరవైలోనే కనిపిస్తోంది. తెల్లజుట్టుతో బయటికి వెళ్లలేక..మార్కెట్లో దొరికే రంగులు వేసుకోలేక చాలా ఇబ్బందిపడుతున్న టైం ఇది. చాలా రకాల హెయిర్ డైలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పత్తులనుంచి లోకల్ మేడ్ వరకు రకరకాల హెయిర్ డైలు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో దొరికే ఈ హెయిర్ డైలు రసాయనాల వల్ల కల్తీ అవుతున్నాయని రెగ్యులర్ గా డై వాడకం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న  క్రమంలో హెయిర్ డై వాడకంపై CDSCO కొత్త ఆదేశాలు జారీ చేసింది. 

త్త రూల్స్ ప్రకారం..హెయిర్ డై కంపెనీలు తప్పనిసరిగా  భద్రతా ప్రమాణాలను పాటించాలని హెచ్చరించింది. హెయిర్ డై వాడకం,  సైడ్ ఎఫెక్ట్స్, నివారణ చర్యలు, సెక్యూరిటీ ప్యాచెస్ కు సంబందించిన కంపల్సరీ ప్యాకెజింగ్ పై  రాయాలని ఆదేశించింది. 

హెయిర్ డైలను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు కాస్మోటిక్స్ నిబంధనలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS) ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని  CDSCO తెలిపింది. హెయిర్ డైలో వాడే రంగులు, పదార్థలు, సెక్యూరిటీ ప్యాచెస్ లను  తప్పనిసరిగి ప్యాకేజింగ్ పై ఉండాలని తెలిపింది. నాణ్యత లేని హెయిర్ డైలు ,కాస్మెటిక్ ఇంజెక్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.