Hair Beauty: సేఫ్టీ కలరింగ్.. నేచురల్ ప్రాసెస్.. జుట్టు నల్లగా.. ఒత్తుగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!

Hair Beauty: సేఫ్టీ కలరింగ్.. నేచురల్ ప్రాసెస్.. జుట్టు నల్లగా.. ఒత్తుగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!

జుట్టుకి రంగు వేసుకోవడానికి కెమికల్స్​ వాడుతున్నారా? అయితే, వీటి ద్వారా వెంటనే ఫలితం ఉండొచ్చు. కానీ ఈ హెయిర్ డైలు జుట్టును మరింత డ్రైగా డల్ గా మార్చడానికి కారణమవుతాయి. పైగా వీటివల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల కాస్తంత ఓపిక తెచ్చుకుని నేచురల్ పద్ధతులను వాడటం మంచిది. వీటితో కావాల్సిన రంగు, షైనింగ్ హెల్దీగా రావడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ని రెండు కప్పుల నీళ్లులో వేసి మరిగించాలి. కాఫీ బాగా స్ట్రాంగ్ గా తయారయ్యాక చల్లార్చాలి. తర్వాత జుట్టుని శుభ్రపరుచుకుని, ఈ కాఫీ డికాషన్ ను జుట్టు, మాడుకు పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకుని అరగంట ఉండాలి. ఇలా వారానికి రెండుసా ర్లు చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

మైదాకు (హెన్నా)ను ముద్దగా సూరి జుట్టుకు పెట్టుకోవడం పాతకాలం నుంచి వస్తున్న అలవాటే అయితే ఇప్పుడు ఇన్ న్స్టంట్ రిజల్ట్స్​ కావాలంటే కెమికల్స్ జోలికి వెళ్తున్నారు. అలాకాకుండా మైదాకు లేదా మార్కెట్లో దొరుకుతున్న నేచురల్ హెన్నా పౌడర్ లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల జుట్టు మెరూన్ కలర్​ లోకి మారడంతో పాటు, జుట్టుకు కండి షనింగ్ అందుతుంది...

మందార పువ్వు పొడి కూడా.. జుట్టుకు హెయిర్ డైగా ఉపయోగ పడుతుంది. దీనికోసం మందార పువ్వులను నీళ్లలో వేసి మరిగించాలి. తర్వాత ఆ నీళ్లను వడగట్టి చల్లార్చాలి. జుట్టు, మాడుకు ఈ నీళ్లతో మసాజ్ చేయాలి. నీళ్లకు బదులు కొబ్బరి నూనెలో కూడా మందార పువ్వులు వేసి మరిగించి వడగట్టాలి. దీన్ని వారానికి మూడు సార్లు రాసుకున్నా జుట్టు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.
బీట్​ రూట్ క్యారెట్లను సమపాళ్లలో తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. దాన్ని పడగట్టాక వచ్చిన రసాన్ని జుట్టుకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలను శుభ్రం చేసుకోవాలి.