అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్‌లో ప్రియదర్శన్ రూపొందిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘హైవాన్’. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ పూర్తిస్థాయి నెగిటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. సైఫ్ అలీఖాన్ బ్లైండ్ పర్సన్‌గా కనిపించగా, అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించాడు. భవనం పై నుంచి నోట్ల కట్టలు పడటం, గాయాలతో సహాయం కోసం ఒకరు వేచి చూస్తుండటం లాంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అక్షయ్, సైఫ్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి.
