సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌తో వస్తున్న 105 మినిట్స్

సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌తో  వస్తున్న 105 మినిట్స్

హన్సిక ఫిమేల్  లీడ్‌‌గా రాజు దుస్స దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన చిత్రం ‘105 మినిట్స్’. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో దీన్ని రూపొందించారు. జనవరి 26న సినిమా రిలీజ్ కానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. హన్సిక చేసిన పెర్పార్మెన్స్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్‌‌లతో ఉత్కంఠరేపేలా ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం.

ఎనిమిది రోజులు రిహార్సల్స్ చేశా. సింగిల్ క్యారెక్టర్ చేయడం నాకు కొత్త ఎక్స్‌‌పీరియెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి హీరో. అద్భుతమైన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ఇచ్చారు. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’ అని చెప్పింది.   దర్శకుడు రాజు దుస్స మాట్లాడుతూ ‘రెగ్యులర్ సినిమాలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్‌‌గా ఉంటుంది. కథ నచ్చి ఒప్పుకున్న హన్సికకు, నిర్మాత శివకు థ్యాంక్స్. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.  నిర్మాత బొమ్మక్ శివ, కో ప్రొడ్యూసర్ సుమన్ ప్రసాద్, డీవోపీ కిశోర్, ఎడిటర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.