Hanuman Movie: హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Hanuman Movie: హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ (HanuMan). కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12న) రిలీజ్ కాబోతుంది. అంటే హనుమాన్ మూవీ మరికొన్నిగంటల్లో థియేటర్లోకి రాబోతుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. 

హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

నైజాంలో 7.15 కోట్లకి డీల్ కుదిరినట్లు సమాచారం.సీడెడ్ లో చూసుకుంటే 4 కోట్ల బిజినెస్,ఆంధ్రాలో 9.50 కోట్లకి వరకు అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ 20.65 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 2 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ లో 4 కోట్లకి హనుమాన్ రైట్స్ అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ హనుమాన్ ఓవరాల్ బిజినెస్ 26.65 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వరకు చెబుతున్నాయి. 

ఇంకా హనుమాన్ సినిమాకి 27.50 కోట్ల షేర్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్లే అని సినీ క్రిటిక్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో, నార్త్ లో హనుమాన్ మూవీ పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. దీంతో ఓపెనింగ్స్ కలెక్షన్స్ లో హనుమాన్ అదిరిపోయే విధంగా వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక వీకెండ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా..అదే హవా కొనసాగిస్తే హనుమాన్ బాక్సాఫీస్ లెక్కలు ఎవ్వరూ ఆపలేరు.

హనుమాన్ మూవీ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.