
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజా సజ్జా(Taja Sajja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). సంక్రాంతికి జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది ఈ మూవీ. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్ల సునామీ ఆగడంలేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.250 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ గ్రాటిట్యూడ్ మీట్ ను ఏర్పాటుచేశారు మేకర్స్.
ఇక ఓవర్ సీస్ విషయానికి వస్తే.. టాప్ స్టార్స్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఇప్పటికే ఓవర్ సీస్ కలెక్షన్స్ పరంగా టాప్ 5 లిస్టులో నిలిచిన ఈ సినిమా.. తాజాగా 5 మిలియన్ మార్కుని కూడా దాటేసింది. ఒక మీడియం రేంజ్ సినిమా, ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, మాములు బడ్జెట్ తో వచ్చి ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు ఓవర్ సీస్ లో హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి.
ఇప్పటికి ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఈ సినిమాను చూస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో హనుమాన్ సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.