ఓవర్ సీస్లో హనుమాన్ ఊచకోత.. స్టార్ హీరోల రికార్డ్స్ ఒక్కటి కూడా మిగలలేదు

ఓవర్ సీస్లో హనుమాన్ ఊచకోత.. స్టార్ హీరోల రికార్డ్స్ ఒక్కటి కూడా మిగలలేదు

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth verma), హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. లార్డ్ హనుమాన్ బ్యాక్డ్రాప్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ బ్రిలియంట్ టేకింగ్, తేజ సజ్జ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోతున్నారు. థియేటర్స్ మొత్తం జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోతున్నాయి.

అశేషమైన ప్రేక్షక ఆదరణతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది హనుమాన్ మూవీ. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాలకు సైతం రాని కలెక్షన్స్ హనుమాన్ సాధిస్తోంది. లెక్కల్లో కొత్త లెక్కలు సెట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆడియన్స్ హనుమాన్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అక్కడ హనుమాన్ రిలీజైన అయిన నాలుగు రోజుల్లోనే ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

దాంతో నార్త్ అమెరికాలో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ హనుమాన్ చోటు దక్కించుకుంది. దీన్నిబట్టి చూస్తే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక నార్త్ అమెరికాలో డే 1 525K డాలర్లు వసూలు చేసిన హనుమాన్ మూవీ.. రాజమౌళి RRR, బాహుబలి రికార్డ్స్ ని పక్కకునెట్టేసింది. రోజురోజుకీ ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతూనే ఉన్నాయి. అదే గనక జరిగితే ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన హనుమాన్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం.