
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma).. ఇది పేరు కాదు బ్రాండ్. తీసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. తాజాగా ఈ దర్శకుడి నుండి వచ్చిన మూవీ హనుమాన్(Hanuman). సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల అయ్యింది. అంతే భారీ రెస్పాన్స్ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తోంది.
విడుదలైన మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. హనుమాన్ ను ప్రశాంత్ వర్మ చూపించిన విధానానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. ఆ ఇంపాక్ట్ కి థియేటర్స్ అన్నీ దేవాలయాలుగా మారిపోతున్నాయి. ఆ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది హనుమాన్ సినిమా. ఇక సినిమా మొదలైనప్పటి నుండి కూడా హనుమంతులవారే తమతో ఈ సినిమాను చేయించారని చెప్పుకొచ్చారు హనుమాన్ టీమ్.
Look who’s come to my office! ? pic.twitter.com/lLbIYJaIlW
— Prasanth Varma (@PrasanthVarma) January 12, 2024
ఇక హనుమాన్ సినిమా రిలీజ్ సందర్బంగా నిజంగానే హనుమంతుల వారు ప్రశాంత్ వర్మ ఇంటికి వచ్చారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకుంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు ప్రశాంత్. ఆ ఫొటోలో ప్రశాంత్ వర్మ ఆఫీస్ గోడపై ఓ కోతి కూర్చొని కనిపించింది. ఆ కోతి ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. చూడండి మా ఆఫీస్ కు ఎవరు వచ్చారో.. అంటూ రాసుకొచ్చారు. తన ఆఫీస్ కు ఆ హనుమంతులవారే అతిధిగా వచ్చారు అన్నట్టుగా ట్వీట్ పెట్టారు ప్రశాంత్. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హనుమాన్ సినిమాలో కూడా కోటి పాత్రలో కోతి కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు మాస్ మహారాజా రవితేజ డబ్బింగ్ చెప్పడంతో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.