
హనుమాన్ (HanuMan) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ పైన రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
హనుమాన్ మేకర్స్ అన్నమాట ప్రకారం..నిన్నసాయంత్రం (జనవరి 11న) వేసిన ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా..ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమైనన్ని రోజులు కూడా ప్రతి టికెట్‌పై రూ.5ను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రాముడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్ అంటూ నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
చిన్న సినిమాకు..థియేటర్లు దొరకడం లేదంటూ..భీభత్సంగా సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. అయిన ఎక్కడ వెనక్కడుగు వేయకుండా సంక్రాంతి బరిలోకి దిగిన హనుమన్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఫెస్టివల్ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు భారీ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది.
Team #HANUMAN gathers for the 'Blockbuster Success Meet' at Film Nagar Hanuman Temple, HYD ?
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024
Here are some snaps of them seeking blessings from Lord Hanuman & sharing their joy of success ❤️?
- https://t.co/EDNd4iyn3b
A @PrasanthVarma Film
?ing @tejasajja123… pic.twitter.com/FvtVpMA27d