హనుమాన్ దెబ్బకు కేజీఎఫ్, కాంతార రికార్డ్స్ ఔట్.. నాలుగురోజుల లెక్కెంతో తెలుసా?

హనుమాన్ దెబ్బకు కేజీఎఫ్, కాంతార రికార్డ్స్ ఔట్.. నాలుగురోజుల లెక్కెంతో తెలుసా?

హనుమాన్(HanuMan) సినిమా దెబ్బకు పాత రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న లెక్కలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే సినిమాకు ఫుల్లు పబ్లిసిటీ అవుతోంది. అంతేకాదు.. అతి తక్కువ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ ను ఆడియన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్స్ కు వచ్చిన హనుమాన్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ.

ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఇదే విషయాన్ని తన సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. 2024లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ హ‌నుమాన్‌. మొద‌టి మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది ఈ మూవీ. కేజీఎఫ్ 1, కాంతార హిందీ వ‌ర్ష‌న్స్‌ కంటే ఎక్కువ‌ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. రాను రాను ఈ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. హిందీలో డే 1 రూ.2.15 కోట్లు, రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు రూ.6.06 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇక హిందీలో జ‌న‌వ‌రి 25వ‌ర‌కు పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి హ‌నుమాన్ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవకాశం ఉంది.. అంటూ రాసుకొచ్చాడు తరణ్. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ఇప్ప‌టివ‌ర‌కు హనుమాన్ మూవీ రూ.40 కోట్ల పైనే వ‌సూళ్లు రాబట్టిందని సమాచారం. అయితే ఈ లెక్కలపై  మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌టన ఇవ్వలేదు.