
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varama) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్ (HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా..వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..హనుమాన్ సినిమా ఓటీటీలో రిలీజ్కు సిద్దమయ్యింది. ప్రముఖ ఎంటర్‌టైనింగ్ సంస్థ 'జీ5' (ZEE5)ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజైన మూడు వారకు ఓటీటీలోకి రావాలి. కానీ హనుమ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుండంటంతో..రిలీజైన 55 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే..ఈ సినిమా మర్చి రెండో వారంలో రిలీజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. త్వరలో హనుమాన్ మేకర్స్ ఆఫీసియల్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
#M9Exclusive
— M9.NEWS (@M9Breaking) January 29, 2024
Zee5 has #HanuMan OTT Rights.
Original Agreement is for streaming after three weeks. Zee5 extended it to after 55 days helping the theatrical run.
The film is a jackpot for Zee!
హనుమంతుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఓవర్ సీస్ లోను ఇదే హవా కొనసాగిస్తోంది.