
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్(HanuMan). భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ ఆడియన్స్ చెప్తున్నారు. ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
ఇక రిలీజ్ కు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు హనుమాన్ మేకర్స్. వాటికి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు వచ్చిన హైప్ కి ఒక స్టార్ హీరో రేంజ్ ప్రీమియర్స్ పడ్డాయి. దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అందులో అన్ని ఫుల్ అవడం అనేది ఇక్క విశేషం. స్టార్స్ లేని హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ ప్రీమియర్స్ పడడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. కేవలం కంటెంట్ నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీమ్.
ఇక అమెరికాలో కూడా ఈ చిత్రానికి అదిరిపోయే ప్రీమియర్ పడ్డాయి. కేవలం ప్రీమియర్ షోలతోనే 250 వేల డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది హనుమాన్ మూవీ. ఇక అన్ని ఏరియాల నుండి కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో త్వరలోనే 1 మిలియన్ మార్క్ దాటే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే.. హనుమాన్ మూవీ రూ.100 కోట్ల మార్క్ ను ఈజీగా అందుకునే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.