బోల్డ్ కంటెంట్తో వస్తున్న హ్యాపీ ఎండింగ్.. యూత్ను ఆకట్టుకుంటున్న ట్రైలర్

బోల్డ్ కంటెంట్తో వస్తున్న హ్యాపీ ఎండింగ్.. యూత్ను ఆకట్టుకుంటున్న ట్రైలర్

యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది.  శనివారం ట్రైలర్‌‌‌‌ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్‌‌ మూవీ అనిపిస్తోంది. బాలీవుడ్‌‌లో ‘వికీ డోనర్‌‌‌‌’ తరహాలో తెలుగులో ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నాడు.

యష్ పూరి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తే కొంత అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో కలిసి చూడొచ్చు’ అని చెప్పాడు. అపూర్వ రావ్ మాట్లాడుతూ ‘ఇందులో మేము బోల్డ్‌‌ పెర్ఫార్మెన్స్ చేయలేదు, కథే బోల్డ్‌‌గా ఉంటుంది’ అని చెప్పింది. సినిమాకు సంబంధించి ప్రతి అంశం కొత్తగా ఉంటుందని నిర్మాత అనిల్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక హానెస్ట్‌‌ మూవీ. మైథాలజీలో ఉండే శాపాలు లాంటివి,  ప్రస్తుత కాలంలోని ఓ కుర్రాడికి ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌‌తో మోడ్రన్‌‌ అప్రోచ్‌‌తో చేసిన సినిమా ఇది’అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి, ఎడిటర్ ప్రదీప్,  సినిమాటోగ్రాఫర్ అశోక్ సీపల్లి తదితరులు పాల్గొన్నారు.