నాన్నంటే అందరి జీవితంలో స్పెషల్. నాన్నంటే భరోసా. అమ్మ ప్రేమ కనిపిస్తుంది.. కానీ నాన్న ప్రేమ కనబపడదు. అతి గారాబం చేస్తే పిల్లలు ఎవరినీ లెక్క చేయకుండా తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని.. కొండంత ప్రేమ గుండెల్లో ఉన్నా.. బయటకి కటువుగా పలుకుతూ.. కొంచెం కోపం వ్యక్తపరుస్తూ.. పిల్లల్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శి. ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోకుండా జీవితాంతం మోసే నాన్న కోసం ఒక రోజు.. ఫాదర్స్ డే.
జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా.. నాన కు విషెస్ చెప్పడం.. ఆ రోజును నాన్నకు డెడికేట్ చేయడం కోసం.. నాన్న బెస్ట్ కొటేషన్స్, మెసేజెస్, స్టేటస్ షేరింగ్ మీ కోసం.
ఫాదర్స్ డే ను ప్రతీ ఏటా జూన్ 3వ సండే (ఆదివారం) జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం, అమెరికా, యూకే వంటి దేశాల్లో ఈ రోజు తండ్రులను గౌరవించి, వారి ప్రేమ, త్యాగాలను గుర్తుచేసుకునే రోజు. తండ్రి అంటే కేవలం తండ్రి కాదు – మన మొదటి హీరో, రక్షకుడు, గురువు, స్నేహితుడు. ఆయన లేకుండా మన జీవితం అసంపూర్ణం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రి, తాత, లేదా తండ్రి స్థానంలో ఉన్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, మెసేజ్‌లు పంపండి.
హ్యాపీ ఫాదర్స్ డే 2026 శుభాకాంక్షలు (Wishes):
హ్యాపీ ఫాదర్స్ డే 2026! థ్యాంక్యూ నాన్న. మాపైన మీ అనంతమైన ప్రేమ, సపోర్ట్, మమ్మల్ని పెంచడంలో మీ త్యాగాలకు ధన్యవాదాలు నాన్నా.
ప్రపంచంలోనే గొప్ప నాన్న హ్యాపీ ఫాదర్స్ డే! ఈ రోజు మీ రోజు.. సంతోషం, నవ్వులు, ప్రేమతో నిండిపోవాలి.
నాన్నా, మీ తెలివి, దయ, ప్రోత్సాహం నన్ను ఈ రోజు ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దాయి. హ్యాపీ ఫాదర్స్ డే!
బలహీనతలో బలం, దారి తప్పినప్పుడు సక్రమ మార్గంలో పెట్టిన మార్గదర్శకులు మీరే నాన్న. మీరే నా లైఫ్ లో అతి ముఖ్యమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే 2026!
నాన్నా, మీ ప్రేమను మించిన గొప్ప ఆశీర్వాదం నాకు జీవితంలో లేదు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
హ్యాపీ ఫాదర్స్ డే కోట్స్ (Quotes):
ఎవరైనా తండ్రి కావచ్చు, కానీ నాన్న అనడానికి ప్రత్యేక వ్యక్తి కావాలి. — Anne Geddes
నా తండ్రి నాకు ఇచ్చిన అతి గొప్ప బహుమతి – జీవితంపై నాకు నమ్మకం కలిగించడం.— Jim Valvano
తండ్రి హృదయం ప్రకృతి సృష్టించిన అపూర్వ కళాఖండం. — Antoine François Prévost
తండ్రులు సాధారణ మనుషులే కానీ.. ప్రేమ వారిని హీరోలుగా, సాహసికులుగా మారుస్తుంది. — Pam Brown
ఒక తండ్రి వంద మంది ఉపాధ్యాయులకు సమానం. — George Herbert
హ్యాపీ ఫాదర్స్ డే మెసేజెస్ (Messages):
నాన్నా, మీ త్యాగాలు, కష్టాలు, మీ నిస్వార్థ ప్రేమ నా జీవితాన్ని రూపుదిద్దాయి. హ్యాపీ ఫాదర్స్ డే!
ప్రతి చాలెంజ్ లో.., ప్రతి సంతోషంలో మీరు ఉన్నారు. ఈ ఫాదర్స్ డే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ నమ్మకమే నా కలలను సాధించేందుకు ధైర్యం ఇచ్చింది. హ్యాపీ ఫాదర్స్ డే 2026!
జీవితంలో ఎక్కడికి వెళ్లినా, మీరు చూపిన దారి, సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటాయి. మీకు ఆరోగ్యం, సంతోషం కోరుకుంటున్నాను నాన్నా.
వాట్సాప్ స్టేటస్ & షేర్ చేయడానికి మెసేజ్‌లు:
హ్యాపీ ఫాదర్స్ డే 2026! నాన్నా, మీ అనంతమైన ప్రేమ, మీరు చూపిన దారి, మీ సపోర్ట్ కు ధన్యవాదాలు.
నా మొదటి హీరో, గొప్ప గురువు, జీవితాంతం స్ఫూర్తి మీరే నాన్న – హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా!
తండ్రి ప్రేమ శాశ్వతం. గొప్ప తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే!
నాన్నా, మీరు నాకు బలం ఇచ్చారు, దారి చూపారు. హ్యాపీ ఫాదర్స్ డే!
ఎలా బతకాలో తండ్రి చూపించే దారి జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదం. హ్యాపీ ఫాదర్స్ డే 2026!
ఈ ఫాదర్స్ డే మీ తండ్రికి సమయం కేటాయించండి, ఆయనతో గడపండి, మీ ప్రేమ వ్యక్తపర్చండి. ఒక చిన్న మెసేజ్ లేదా కాల్ కూడా వారి హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. హ్యాపీ ఫాదర్స్ డే 2026! మీ తండ్రి ఎప్పటికీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
