రాజప్ప పాత్రకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: ప్రదీప్ కొట్టె

రాజప్ప పాత్రకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: ప్రదీప్ కొట్టె

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలోని రాజప్ప పాత్రతో మంచి గుర్తింపు అందుకున్నాడు ప్రదీప్ కొట్టె. కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేస్తూ కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రానికి వి.మునిరాజు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే థియేటర్స్‌‌‌‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌‌‌‌ అవుతోంది. 

ఈ సందర్భంగా  ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ ‘మాది చిత్తూరు జిల్లా పలమనేరు. చెన్నైలో జాబ్ చేసి  హైదరాబాద్‌‌‌‌కి షిఫ్ట్ అయ్యా. ఇక్కడకు వచ్చాక షార్ట్ ఫిల్మ్స్ అంటూ యాక్టింగ్ వైపు వచ్చాను. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ నేతృత్వంలో నాటకాలు వేశాను. ఆ నాటకాల్ని మా డైరెక్టర్ వి.మునిరాజు  చూశారు.

రాజప్ప క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్ చేసి తీసుకున్నారు.  కిరణ్ అబ్బవరం నిర్మాత అని తెలియగానే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను పోషించిన  రాజప్ప పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నా తొలి సినిమాకే మంచి పేరు రావడం ఆనందంగా అనిపించింది. ఈ చిత్రంలో  ప్రతి పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. - ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. ప్రాధాన్యత ఉన్న  పాత్రలే పోషించాలని వెయిట్ చేస్తున్నా’ అని చెప్పాడు.