Hardik Pandya: త్వరలో హార్దిక్ పాండ్యా, మహికా శర్మల పెళ్లి.. నెట్టంట ఫన్నీ మీమ్స్ వైరల్

Hardik Pandya: త్వరలో హార్దిక్ పాండ్యా, మహికా శర్మల పెళ్లి.. నెట్టంట ఫన్నీ మీమ్స్ వైరల్

Hardik Pandya: భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆటతోనే కాదు, పర్సనల్ లైఫ్‌తోనూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతునే ఉంటాడు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా కొనసాగుతున్న వేళ, హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ కమ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాహీకా శర్మను రెండో వివాహం చేసుకోబోతున్నాడంటూ అనే ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్ వేదికలుగా ఈ వార్త తెగ ట్రెండింగ్ అవుతోంది.  

వైరల్ పోస్ట్?: 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. మే 22వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో హార్దిక్ పాండ్యా, మాహీకా శర్మ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మాహీకా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక స్టోరీలో పెళ్లి అక్షరాల తరహాలో డిజైన్ ఉండటం, అలాగే హార్దిక్ గాయం (బ్యాక్ స్పాజమ్స్) కారణంగా ముంబై ఇండియన్స్ కి గత కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి.

మీమ్స్ తో నెటిజన్ల రియాక్షన్స్: 
ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మధ్యలో ఈ పెళ్లి గోల ఏంటని కొందరు ఆశ్చర్యపోతుంటే, మీమ్స్ రాయుళ్లు మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారిస్తున్నారు. 


నెగెటివ్ ట్రోలింగ్: ముంబై ఇండియన్స్ ఆటతీరు బాగా లేని సమయంలో ఇలాంటి వార్తలు రావడంపై కొందరు కెప్టెన్‌ను టార్గెట్ చేస్తుండగా.. 

ఫ్యాన్స్ సపోర్ట్: "ఫీల్డ్‌లో ఉన్నా, ఆఫ్ ది ఫీల్డ్ ఉన్నా హార్దిక్ ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోనే ఉంటాడు" అని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఒక ఆటగాడి వ్యక్తిగత జీవితాన్ని క్రికెట్‌తో ముడిపెట్టవద్దంటూ పాండ్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. 

కాగా ఈ అంశంపై హార్దిక్– మహికా పెద్దగా రియాక్ట్ కాలేరు.. దీంతో ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా తన పూర్తి ఫోకస్‌ను ఐపీఎల్ 2026, క్రికెట్‌పైనే ఉంచినట్లు సమాచారం. కాబట్టి ఈ పెళ్లి వార్తలు కేవలం సోషల్ మీడియా పుకార్లేనని తేలిపోయింది.