Hardik Pandya: రూ. 12 కోట్ల కార్ ఫెర్రారీ కారుకి హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌ ప్రత్యేక పూజలు 

Hardik Pandya: రూ. 12 కోట్ల కార్ ఫెర్రారీ కారుకి హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌ ప్రత్యేక పూజలు 

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన కొత్త రూ. 12 కోట్ల కార్ ఫెర్రారీ 12 సిలిండ్రి లగ్జరీ కార్ ను కొనుగోలు చేసి ఆ ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అతని గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మ కార్ కోసం సంప్రదాయబద్ధంగా పూజ చేసింది. ఈ క్షణాన్ని పాండ్యా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఫ్యాన్స్ ఈ సంప్రదాయ-– లగ్జరీ కలయికని చూసి నెట్టింట విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

హార్దిక్ పాండ్యా గ్యారేజ్‌లో చేరిన కొత్త కార్ ఫెర్రారీ 12 సిలిండ్రి, భారత్‌లో దాదాపు12 కోట్ల రూపాయల ఖర్చుతో లభించే సూపర్‌కార్. శక్తివంతమైన V12 ఇంజిన్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ లో ఈ లగ్జరీ కార్ ఉంది. వైరల్ అయిన వీడియోలో, మాహికా పూజా సామగ్రితో కార్‌పై తిలకం దిద్దతూ ఉన్న ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తూ హార్దిక్ కనిపిస్తారు. భారతీయ సాంస్కృతిలో మహికా శర్మ పూజ చేయడంతో ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోతో హార్దిక్ పాండ్యా తిరిగి ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు.  

మార్చి 28వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్ జట్టుకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా కొనసాగుతున్నారు. ఆరోవసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలని టీమ్ ఉంది. దీంతో ఇప్పటికే జట్టుని ముంబై జట్టు సన్నాహాలు స్టార్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్స్ లో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, జస్ ప్రీత్ బుమ్రాలు జోరుగా  శ్రమిస్తున్నారు.