
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను శనివారం ప్రకటించారు. జులై 24న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్.. ‘ఒకరు ధర్మం కోసం పోరాడుతారు. ఒకరు అధికారం కోసం పోరాడతారు. వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది. సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం యుద్ధానికి సిద్ధమవండి. హిస్టారిక్ ఎక్స్‌పీరియెన్స్‌కు వేచి ఉండండి’ అంటూ పోస్ట్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటించగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. సత్యరాజ్, జిషు, సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్‌ను చిత్రీకరించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.