ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. హరీశ్ రావు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. హరీశ్ రావు

మెదక్ పార్లమెంటు పరిధిలోని చిన్న కోడూరులో జరిగిన...ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు,  వెంకట్రామ్ రెడ్డి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు హరీశ్. కొత్త పథకాలు ఏమోగాని ఉన్న పథకాలు ఎగ్గొడుతున్నారని అన్నారు. తాము 24 గంటల  కరెంట్ తామిస్తే.. కాంగ్రెస్ 16గంటలు కూడా కరెంట్ ఇస్తలేదని మండిపడ్డారు హరీష్ రావు.కలెక్టర్ గా పని చేసిన స్థానం నుంచే పార్లమెంట్ కు వెళ్ళే ఛాన్స్ రావడం అదృష్టమన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి.