Virat Kohli: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన సంచలన ఆటతీరుతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం అతని పర్ఫార్మెన్స్ కాదు.. నెట్టింట వైరల్ అవుతున్న ఒక వివాదాస్పద వీడియో. ఆ వీడియోలో వైభవ్.. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీని అవమానించేలా మాట్లాడినట్లు ఉంది. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నకు.. కోహ్లీ చాలా స్లోగా ఆడతాడు అంటూ వైభవ్ కామెంట్ చేసినట్లు ఆ క్లిప్‌లో చూపించారు.. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆ యంగ్ క్రికెటర్‌పై గుర్రుమన్నారు.
సీన్‌లోకి వచ్చిన హర్ష భోగ్లే:
ఈ వివాదం కాస్తా పెద్దది కావడంతో స్వయంగా హర్ష భోగ్లే రంగంలోకి దిగి సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని బయట పెట్టాడు. ఆ వైరల్ వీడియో వందకు వంద శాతం ఫేక్ అని తేల్చి చెప్పాడు. అందులో వైభవ్‌పై అసత్యం ప్రచారం చేశారు.. నిజానికి నేను అతడిని అసలు ఆ ప్రశ్నే అడగలేదు, తను కూడా నాకు అలాంటి సమాధానం ఇవ్వలేదు.. ఎవరో కావాలనే డీప్‌ఫేక్ లేదా వాయిస్ ఎడిటింగ్ ద్వారా దీన్ని క్రియేట్ చేశారు.. ఎంతో హంబుల్ గా ఉండే ఒక యంగ్ క్రికెటర్‌పై ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం చాలా దారుణం అని వెల్లడించారు.
అసలు ఆ ఫేక్ వీడియోలో ఏముంది?:
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఆ ఎడిటెడ్ వీడియోలో సంభాషణ ఇలా సాగింది:
* హర్ష భోగ్లే (ఫేక్ వాయిస్): నువ్వు కూడా విరాట్ కోహ్లీలా క్రికెట్ ప్రపంచాన్ని ఒక రాజులా ఏలాలి అనుకుంటున్నావా?
* వైభవ్ సూర్యవంశీ (ఫేక్ వాయిస్): నాకు విరాట్ భయ్యా అంటే ఇష్టమే.. కానీ అతని రికార్డులు నాకు నచ్చవు.. తను చాలా నెమ్మదిగా ఆడతాడు.. హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తాడు అన్నట్లు అందులో ఉంది.
ఫ్యాన్స్.. ప్లీజ్ నమ్మకండి:
హర్ష భోగ్లే ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఐపీఎల్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న కుర్రాడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కొందరు నెటిజన్లు ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని తెలుస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను బ్లైండ్‌గా నమ్మేయద్దంటూ క్రికెట్ లవర్స్ ఇప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారు.
There is a fake dubbed clip of me and Vaibhav Sooryavanshi doing the rounds on social media. It depicts Vaibhav as being rude and cocky. Neither was that question asked nor was there an answer like that. It is cruel and mischievous especially towards a young kid who has been…
— Harsha Bhogle (@bhogleharsha) June 2, 2026
